Digital Kasipet:-
పోలీస్ స్టేషన్లలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ అన్నారు. పల్లె పకృతి కార్యక్రమంలో భాగంగా గురువారం కాసిపేట పోలీస్ స్టేషన్ లో తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కాసిపేట పోలీస్ స్టేషన్ సిబ్బందితో పోలీస్ స్టేషన్ ఆహ్లాదకరం కనిపించే విధంగా మొక్కల నాటలని అలాగే వాటి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి, ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్ కుమార్ ,బెల్లంపల్లి ఏసిపి ఏం. ఏ రహెమాన్, జైపూర్ ఏసీపీ నరేందర్, మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్, మందమర్రి సీఐ ప్రమోద్ కుమార్, ఎస్ఐ నరేష్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.