Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అనాధ పిల్లలకు అండగా ఎమ్మెల్యే చిన్నయ్య

Digital Kasipet:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారులు సుచిత్ర, సుష్మిత, సిద్ధార్థ్ లను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు. శుక్రవారం వారి ఇంటికి వెళ్లి వారి పరిస్థితులను అడిగి తెలుసుకుని తక్షణ ఖర్చుల కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి శ్రీ నల్లాల భాగ్యలక్ష్మి - ఓదెలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ ముగ్గురి విద్యా బాధ్యతలు పూర్తిగా తానే చూసుకుంటానని, భవిష్యత్తులో వారికి అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, వైస్ ఎంపీపీ విక్రమ్, జడ్పీటీసీ చంద్రయ్య, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App