Digital Kasipet:-
అతను సినిమా మీద మక్కువతో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడు. డైరెక్టర్ అవ్వాలనే ఆశయంతో హైదరాబాద్ లో వివిధ దర్శకుల వద్ద దర్శకత్వం నేర్చుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. పూర్తి వివరాలలోకి వెళ్తే కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన దుర్గం సంతోష్ Ban Plastic, మగువ, నేనే రైతు లాంటి సామజిక అంశాలపైన షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ సినిమా డైరెక్షన్ అవకాశలకోసం ఎదురు చూసాడు. అతని ప్రతిభను గుర్తించి ప్రొడ్యూసర్ బుర్ర అరుణ్ కుమార్ ముందుకు రావడంతో ప్రస్తుతం తన మొదటి సినిమాను రూపొందిస్తున్నాడు. సినిమా షూటింగ్ 70% పూర్తి అయ్యిందని, అక్టోబర్ లోగా OTT ద్వారా గాని, థియేటర్ లలో గాని విడుదల చేస్తామని డైరెక్టర్ సొంతోష్ తెలిపారు.