Digital Kasipet:-
కాసిపేట మండలం పెద్దనపల్లి శివారులోని సర్వే నెం5 లో గల ప్రభుత్వ భూమిని భూ అక్రమార్కులు కబ్జా చేశారని జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, పెద్దనపల్లి ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్ అన్నారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ కి సమీపంలో గల ఈ ప్రభుత్వ భూమిలో కబ్జా దారులు ఆకనేపల్లి శివారు బెల్లంపల్లి మండలం యొక్క పట్టా పాసుబుక్ పెట్టి షెడ్ వేశారని జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చారు. గతంలో వారు కంచె వేయగా విషయం తెలుసుకున్న కాసిపేట తహసీల్దార్ మరియు బెల్లంపల్లి ఆర్డివో కంచెను తొలగించారని, మళ్ళీ కబ్జాదారులు సర్వే మరియు డివిజనల్ అధికారుల సహాయ సహకారాలతో అధికారుల తప్పుడు రిపోర్ట్ తో బెల్లంపల్లి కార్యాలయం లో ఇంటి నెంబర్ పొంది పెద్దనపల్లి ప్రభుత్వ భూమిలో షెడ్ వేశారని అన్నారు. ఈ విషయంపై సంబంధించిన కార్యాలయంలో అడగగా వారు స్పందించకుండా దాటావేస్తున్నారని, హై వే రోడ్ కి అనుకోని ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని కలెక్టర్ కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు.