Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పెద్దనపల్లిలో ఫైలేరియా, బోదకాలు నివారణ కార్యక్రమం

Digital Kasipet:-
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సోమగూడెం కొత్త కాలనీ, పెద్దనపల్లి గ్రామాలలో గురువారం సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో ఫైలేరియా, బోదకాలు నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు డిఇసి, ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జ్వరం రావడం, బిల్లలు కట్టడం మొదలైన లక్షణాలు క్రమంగా బోదకాలుగా మారుతుందని, ఈ మాత్రలు వాడి వ్యాధి సోకకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ANM పద్మ, అంగన్వాడీ టీచర్ వకుళాదేవి, వార్డు సభ్యులు కొత్త రమేష్, బొల్లపల్లి కోమురక్క, బన్న ఇందుమతి పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App