Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గుడుంబా కేసులో 9 మంది బైండోవర్

Digital Kasipet:-
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిదిలోని లంబాడితండా(కె) గ్రామ శివారులో మంగళవారం మందమర్రి సీఐ ప్రమోద్ రావు, కాసిపేట ఎస్ఐ కె నరేశ్ ల ఆధ్వర్యంలో పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా తయారు కోసం సిద్ధం చేసిన 200 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. దింతో పాటు గుడుంబా తయారీకి సంబందించిన 9 మందిని బైండోవర్ చేశారు. గుడుంబా కాస్తే కఠిన చర్యలు తప్పవని, తయారీ చేసినా, క్రయ, విక్రయలు చేసిన చట్ట ప్రకారం కేసు లు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ ప్రమోద్ రావు, ఎస్ఐ నరేశ్ హెచ్చరించారు. ఈ దాడుల్లో సీఐ ప్రమోద్ రావు, ఎక్సైజ్ ఎస్ఐ లు నిర్మల, శ్రీనివాస్, పోలీస్, సిబ్బంది పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App