Digital Kasipet:-
కాసిపేట మండలం కొమటిచేను ప్రాజెక్ట్ మత్తడి కింద ముగ్గురు యువకులు వరదలో చిక్కుకున్నారు. గురువాపూర్ గ్రామానికి చెందిన యువకులు చేపలు పట్టుతున్న సమయంలో ఒక్కసారిగా వరద నీరు రావడంతో మధ్యలో చిక్కుకుపోయారు. వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకోసం చాలా సమయం ఎదురు చూసారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకొని యువకులను క్షేమంగా కాపాడారు.