Digital Kasipet:-
మంచిర్యాల జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గా సోమవారం దుర్గం లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డీసీసీబీ డైరెక్టర్ గా ఎన్నికైనందున ఆమెకు డీసీసీబీ చైర్మన్ కె.నాందేవ్, కాసిపేట మండల జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, సింగిల్ విండో చైర్మన్ బదావత్ నీలా, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు రమణా రెడ్డి, కాసిపేట మండల ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందనలు తెలిపారు.