Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గురువారం కాసిపేట మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మీ, షాధిముభారక్ చెక్కులను మరియు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ మండలంలో 347 రేషన్ కార్డులు వచ్చాయని, రాని వారికీ ఇంతకముందు ఉన్న రేషన్ కార్డు లో పేరును తీసివేయాబడనందు వల్ల రాలేదని పేర్కొన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా పేదింటి పెద్దకొడుకులా ఆదుకుంటున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని రేషన్ కార్డులేని వారి కుటుంబాలకు ఒకవ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం నూతన రేషన్ కార్డులను ఇస్తున్న ఘనత కేసిఆర్ కి దక్కుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో శ్యామల దేవి, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు,తెరాస పార్టీ మండలం అధ్యక్షులు బొల్లు రమణ రెడ్డి, సర్పంచులు, MPTC లు, ఉపసర్పంచ్ లు, వార్డ్ మెంబెర్లు,తెరాస నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.