Digital Kasipet:-
కాసిపేట మండలంలో గురువారం 21.5 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. రాబోయే 48 గంటలు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మండలంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మారుమూల గ్రామాలకు వెళ్ళడానికి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. గ్రామాలలో ఎక్కడైన విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు మరియు వైర్లు క్రింద పడిన, నీటిలో మునిగిన 7901628369, 8331034969,1912 లకు వెంటనే తెలియజేయాలనీ విధ్యుత్ శాఖ అధికారులు సూచించారు.