Digital Kasipet:-
తెలంగాణ ప్రభుత్వం గొల్ల కుర్మ, యాదవుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా బుధవారం కాసిపేట మరియు ముత్యంపల్లి గ్రామాలలో 14 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. అర్హత కలిగిన లబ్దిదారులకు విడుతల వారీగా పంపిణి చేయడం జరుగుతుందని మండల పశువైద్యాధికారి డా.తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, కాసిపేట సర్పంచ్ దారావత్ దేవి, ముత్యంపల్లి ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, ముత్యంపల్లి గోర్రెల కాపారుల సంఘం అధ్యక్షులు మల్లెత్తుల సందీప్, కాసిపేట గొర్రెల కాపారుల సంఘం అధ్యక్షులు గట్టుమల్లు పాల్గొన్నారు.