Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

భారీగా ప్రవహిస్తున్న వరదనీరు... విషాద ఘటనలు

Digital Kasipet:-
మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు ఉధృతంగా ప్రవహించి, విషాద ఘటనలు జరుగుతున్నాయి. కాసిపేట మండలంలోని పెద్దనపల్లి వాగులో సండ్రల్ పాడ్ గ్రామానికి చెందిన లచ్చులు గల్లంతు అయ్యారు. అతడిని కాపాడడం కోసం స్థానికులు మరియు కాసిపేట జడ్పీటీసీ పల్లె చంద్రయ్య స్వయంగా గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు అతని మృతదేహం లభ్యం అయ్యింది. కుర్రెగడ్ గ్రామంలో కుర్సింగ మాధవరావుకు చెందిన ఎద్దు నీటిలో కొట్టుకు పోయి మృతి చెందింది. మందమర్రి మండలం ఊరు మందమర్రి కి చెందిన వ్యక్తి రైల్వే బ్రిడ్జ్ పైనుండి కింద పడి మృతి చెందినట్లు సమాచారం.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App