Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు 300 డోసుల వాక్సిన్ వేయాలని ఎమ్మెల్యే చెప్పిన గురువారం 50 డోసుల వాక్సిన్ మాత్రమే పంపడంపై కాసిపేట కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గురువారం దేవాపూర్ కంపేని నుండి, మండలంలోని గ్రామాల నుండి అధిక సంఖ్యలో వ్యాక్సిన్ కోసం రావడంతో ఆసుపత్రి ప్రాంగణంలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రజలు గుమ్మికూడారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు చాలామంది వెనుదిరిగి పోతున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ ద్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందిచి డోసుల సంఖ్య పెంచాలని మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.