Digital Kasipet:-
టీపీసీసీ నూతన అధ్యక్షులు గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో కాసిపేట మండల కేంద్రం నుండి కొండాపూర్ యాప వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనతంరం టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రత్నం ప్రదీప్ మాట్లాడుతు రేవంత్ రెడ్డి అధ్యక్షులు కావడం వల్ల వివిధ పార్టీ ల నుండి నాయకులు మరియు యువకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, అంతే కాకుండా బెల్లంపల్లి లో గడ్డం వినోద్ నాయకత్వం లో పార్టీ చాలా బలంగా ఉందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం కాయం అని అన్నారు. ఈ కార్యక్రమం కారుకూరి రాంచందర్, మహంకాళి, వుత్తురి రవి, బొరె వంశీ, దుగుట భరత్, సాయి కుమార్ యాదవ్, నవీన్, తరాల పృద్వి, మహేష్ ఆనంద్, బోర్లకుంట రాజు, దుర్గం నవీన్, కోట వివేక్, బన్న రవి రాజా తదితరులు పాల్గొన్నారు.