Digital Kasipet:-
రైతులు BT3 పత్తి విత్తనాలను వేయకూడదని కాసిపేట AO వందన అన్నారు. మండలంలోని దేవాపూర్ గ్రామంలో వ్యవసాయ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ BT3 విత్తనాలను నివారించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే గ్లైఫోసెట్ గడ్డి మందు నిషేధించినప్పటికీ ఇతర ప్రాంతాల నుండి తెచ్చి ఉపయోగిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్లైఫోసెట్ గడ్డి మందు వాడడం వల్ల భూమి సారవంతం కోల్పోవడమే కాకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ ఎస్ఐ విజయేందర్, AEO తిరుపతి, RSS గ్రామ కోఆర్డినేటర్ రాందాస్ పాల్గొన్నారు.