Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో కారుకూరి రాంచందర్, మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగష్టు 9న నిర్వహించబోయే దళిత గిరిజన దండోరా కి కాసిపేట మండలం నుండి పెద్ద సంఖ్యలో దళితులు, గిరిజనులు పాల్గొని బెల్లంపల్లి నియోజకవర్గం లో వినోద్, రాష్ట్రం లో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఆనాడు ఆగష్టు 8 1942 న మహాత్మ గాంధీ గారు తెల్ల దొరల పాలన నుండి విముక్తి కోసం చేసిన క్విట్ ఇండియా ఉద్యమం లాగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న దొరల పాలన నుండి మనకి విముక్తి కలగాలి అంటే దళిత గిరిజన దండోరాని విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం గుండా రాజకుమార్, దుగుట భరత్, గొనె రాజన్న, బోర్లకుంట రాజు, రత్నం రాజేష్ ఖన్నా, అంజి, దాసరి సంపత్, సృజన్, దిళ్లు, రత్నం రవి పాల్గొన్నారు.