Digital Kasipet:-
కాసిపేట మండలంలోని వరిపేట, కోనూరు, వెంకటాపూర్, రొట్టెపల్లి గ్రామాలలో అధిక వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు పరిశీలించారు. సుమారుగా 50 ఎకరాల పత్తి పంట నీట మనిగిందని అంచనా వేశారు. ప్రాథమికంగా అంచనా వేసిన పంటనష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిపారు. వర్షాలు ఆగిన తరువాత పత్తి పంటలో పై పాటుగా ఒక ఎకరానికి 35 కిలోల యూరియా మరియు పది కిలోల పోటాష్ వేయాలని వ్యవసాయ అధికారి వందన రైతులకు సూచించారు. అలా కుదరని పక్షంలో 2 శాతం యూరియా స్ప్రే చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో శ్రీధర్, రైతులు ఉన్నారు.