Digital Kasipet:-
రోజు రోజు కు పెరుగుతన్న పెట్రోల్, డీజీల్ ధరలను నిరశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం దేశావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఇందులో భాగంగా కాసిపేట మండలం ముత్యంపల్లి లోని భారత్ బంక్ వద్ద మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అనంతరం ప్రదీప్ మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం కాకి ని కొట్టి గద్దకు పెట్టినట్టు, సామాన్య ప్రజలని దోచి కార్పొరేట్ సంస్థలకి పెడుతుందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలను 3 రేట్లు కన్నా ఎక్కువ పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు. ఇకనైనా బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో గుండా రాజకుమార్ (ST సెల్ మండల్ ప్రెసిడెంట్), దుగుట భరత్, మహంకాళి, వెంకటేష్, బిక్షపతి కర్రావుల, కర్రావుల సాయికుమార్, గొనె రాజన్న, దుర్గం నవీన్, బన్న రవిరాజా, బోర్లకుంట రాజకుమార్, ఉప్పులేటి రాజకుమార్, కోట వివేక్ పాల్గొన్నారు.