Digital Kasipet:-
రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్బంగా మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో లారీ డ్రైవర్ లకు, స్థానికులకు మాస్కులను, శ్యానిటీజర్ లను పంపిణి చేశారు. అనంతరం రత్నం ప్రదీప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకారం అందించిన మాజీ మంత్రి గడ్డం వినోద్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కరోనా సమయంలో ప్రజలు కష్టాలు పడుతుంటే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఇష్టం లేక పార్టీ నాయకులకి కార్యకర్తలకి తన పుట్టినరోజు వేడుకల్ని ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రజలకి అవసరమైన పనులు చేయాలని రాహుల్ గాంధీ సూచించారని, ఆయన సూచన మేరకు మాస్కు లు, శానిటైజర్ లను పంపిణి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సాయి వంశీ, కాసిపేట్ ST సెల్ మండల్ ప్రెసిడెంట్ గుండా రాజకుమార్, దుగుట భరత్, తాండ్ర నవీన్, సిడం విశ్వక్, కర్రావుల సాయికుమార్, రమేష్, అఖిల్ యాదవ్, పృద్వి, ఉప్పులేటి రాజకుమార్, చంద్రమౌళి, బోర్లకుంట రాజు, రత్నం రాజేష్ ఖన్నా, కోట వివేక్, సంపత్, సృజన్, అంజి పాల్గొన్నారు.
![]() |