Digital Kasipet:-
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి ని కాసిపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి కాసిపేట ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ వర్ధంతిని నిర్వహించారు. మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయలలో, ప్రభుత్వ కార్యాలయాలలో ఆయనకు నివాళులు అర్పించారు.