Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో 90 మందికి ఆంటిజెన్ టెస్ట్ లు నిర్వహించారు. ఇందులో కేవలం 3 మాత్రమే పాజిటివ్ నమోదయ్యాయని గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ తెలిపారు. గ్రామంలో కరోన వైరస్ వ్యాప్తి అరికట్టే విషయంలో ఈ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి సుబ్బరాయుడు, డాక్టర్ అలేఖ్య, ఫార్మసిస్ట్ సంతోష్, ఏ.ఎన్.ఎం సరిత పాల్గొన్నారు.