Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

NMMS స్కాలర్ షిప్ కి కాసిపేట మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపిక

Digital Kasipet:-
మండలంలోని కాసిపేట తెలంగాణ మోడల్ స్కూల్ లో ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS) కి అర్హత సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ అందే నాగమల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి చదువుతున్న మాధురి, అంజలి మరియు రమ్య NMMS కి అర్హత సాధించారని, వీరు 9వతరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు సంవత్సరంకు 12000 స్కాలర్షిప్ పొందుతారన్నారు. విద్యార్థులకి పాఠశాల ప్రిన్సిపాల్ నాగమల్లయ్య మరియు సిబ్బంది అభినందనలు తెలిపారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App