Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

బెల్లంపల్లి నియోజకవర్గానికి అన్ని రకాలుగా అన్యాయం

Digital Kasipet:-
మంచిర్యాల జిల్లా కు మంజూరైన మెడికల్ కాలేజీని బెల్లంపల్లిలో ఏర్పాటు చేయాలని కాసిపేట మండల కేంద్రం కాంగ్రెస్ నాయకులు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రత్నం ప్రదీప్ మాట్లాడుతూ బెల్లంపల్లి కి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందని, జిల్లా విషయం లో కూడా అనేక పోరాటాలు చేసిన బెల్లంపల్లి ని కాకుండా మంచిర్యాల ని జిల్లా చేసారని, బెల్లంపల్లి కి RTC డిపో ఏర్పాటు చేస్తామని,  బెల్లంపల్లి లో G. M ఆఫీస్ ఏర్పాటు చేస్తామని మోసం చేశారని వాపోయారు. బెల్లంపల్లి లో మెడికల్ కాలేజీ కేటాయిస్తే ఇటు ప్రభుత్వానికి ఆర్ధిక భారం తగ్గుతుందని, అంతే కాకుండా ఆసిఫాబాద్, కాగజనగర్, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గ లకి మధ్యలో ఉండడం వల్ల ప్రజలకి కూడా అందుబాటులో ఉంటుందని అన్నారు. తాము ఉద్యమకారులం అని చెప్పుకునే తెరాస నాయకులు మెడికల్ కాలేజీ కోసం ఉద్యమం చేయాలని సవాల్ విసిరారు. బెల్లంపల్లి కి కాకుండా వేరే నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ వెళ్తే అది మన నియోజకవర్గ తెరాస నాయకుల అసమర్ధతే అన్నారు. ఇప్పటికే కాసిపేట మండలానికి ఓపెన్ కాస్ట్ వల్ల తీరని అన్యాయం జరిగిందని, భూములు పోయి నిరుద్యోగం ఎక్కువ పెరిగిందని, బెల్లంపల్లిలో కాలేజీ ఏర్పాటు అయితే కాసిపేట మండలానికి 5 Kms దూరం లో ఉండడం విద్య, వైద్యం పరంగా మండలం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బొరె వంశీ, St సెల్ మండల్ ప్రెసిడెంట్ గుండా రాజకుమార్, కాసిపేట్ సీనియర్ నాయకులు ఉత్తురి సత్తయ్య, శేఖర్ రావు, అప్పని ప్రభాకర్, ఉత్తురి రవి, గోలేటి స్వామి, పల్లపు మహంకాళి, దుగుట భరత్, తాండ్ర నవీన్, కోట సంజయ్, చిలుకయ్య, తరాల ప్రణయ్, సాయి, గోదార్ల అన్వేష్, బోర్లకుంట రాజు, కోట వివేక్, మానితేజ, రత్నం రాజేష్ ఖన్నా , చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App