Digital Kasipet:-
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ కాసిపేట మండల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటినుండో ఉన్న తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ ని వెంటనే ఏర్పాటు చేయాలనీ, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అటక పురం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి సంతోష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ కుమార్, ఉపాధ్యక్షులు బాకీ నరేష్, పులగం వెంకటేష్, పుట్ట శేఖర్, బాపు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.