Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని ఆధార్ కార్డు సేవ కేంద్రంలో అడ్డగోలుగా ఛార్జిలను వసూలు చేస్తున్నారు. మండలంలో ఆధార్ సెంటర్ ఒక్కటే ఉండడంతో ఇదే అదునుగా భావించి ప్రజల నుండి రెట్టింపు చార్జీలు పిండుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించగా ఒక్కో సర్వీస్ కు ఒక్కో రేటు అని సమాధానం ఇచ్చారు. వాస్తవానికి ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఫోటో, పుట్టిన తేది, మొబైల్ నెంబర్ ఇలా ఎన్ని అప్డేట్ చెప్పించిన గరిష్టంగా రూ.100 మాత్రమే ఛార్జ్ తీసుకోవాలి. కానీ కాసిపేట లోని ఆధార్ సెంటర్ లో ఆధార్ కార్డు అప్డేట్ కోసం 150, 200 ఇలా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు.