Digital Kasipet:-
కాసిపేట మండలంలోని వరిపేట గ్రామంలో గుడుంబా తయారుచేసి అమ్ముతున్నారనే సమాచారం మేరకు కాసిపేట పోలీసులు తనిఖీలు నిర్వహించి సపావట్ శంకరమ్మ, సపావట్ శ్రీనివాస్ వారినుండి ఏడు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా బెల్లంపల్లి లోని కోటగిరి దిగంబర్ మరియు చింత వెంకటేష్ ల నుంచి గుడుంబా తయారు చేయడానికి సరుకులు తీసుకువచ్చినట్లు తెలిపారని కాసిపేట ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు. బెల్లంపల్లి లోని సదరు వ్యక్తుల ఇంటి వద్ద తనిఖీ చేసి నాలుగు కిలోల పటిక మరియు బెల్లం స్వాధీనం చేసుకుని, వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలో ఎవరైనా గుడుంబా తయారుచేసిన, తయారీకి సహకరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.