Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

బిజెపి నాయకులు 48 గంటల రిలే నిరాహార దీక్ష

Digital Kasipet:-
బెల్లంపల్లి నియోజకవర్గం లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలనీ కోరుతూ భారతీయ జనతా పార్టీ 48 గంటలు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల బీజేపీ నాయకులు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్కపురం రమేష్, బీజేవైఎం జనరల్ సెక్రటరీ సూరం సంపత్ కుమార్, మండల ఉపాధ్యక్షులు బాకీ నరేష్, పోశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మండల నాయకులు మాట్లాడుతూ బెల్లంపల్లిలో గతంలో మంజూరైనా మెడికల్ కాలేజ్ మధ్యలోనే ఆగిపోయిందని, ప్రస్తుతం బెల్లంపల్లికి కాకుండా జిల్లాలోని వేరే ప్రాంతానికి తరలించే కుట్ర జరుగుతుందని విమర్శించారు. మెడికల్ కాలేజీ బెల్లంపల్లిలోనే ఏర్పాటు చేయాలనీ లేదంటే తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App