Digital Kasipet:-
బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనీ కోరుతూ కాసిపేట మండలం అఖిలపక్షం ఆధ్వర్యంలో కాసిపేట మండల తహసీల్దార్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ తెరాస పార్టీ 2018 ఎన్నికల సందర్బంగా బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆసిఫాబాద్, కాగజనగర్, చెన్నూర్ మరియు మంచిర్యాల నియోజకవర్గలకి బెల్లంపల్లి మధ్యలో ఉండడం అలాగే రైలు, బస్సు, సౌకర్యాలు ఉండడం వల్ల వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారికి ఇబ్బంది లేకుంటే ఉంటుందన్నారు. కావున మెడికల్ కాలేజీ ని బెల్లంపల్లి లోనే ఏర్పాటు చేయాలనీ అఖిల పక్ష నాయకులు దాగం మల్లేష్ (సిపిఐ), రత్నం ప్రదీప్ (కాంగ్రెస్), అటకపురం రమేష్ (బీజేపీ), సొగల సాగర్ (టీడీపీ) కాసిపేట MRO కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కాసిపేట మండల ప్రెసిడెంట్ దాగం రాజలింగు, మండల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ బాకం నరేష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కాల్వ లక్ష్మణ్, బీజేపీ మండల్ వైస్ ప్రెసిడెంట్ పోలవేణి పోశం, దుగుట భరత్, అనపర్తి చంద్రమౌళి, బోర్లకుంట రాజు, కోట వివేక్ పాల్గొన్నారు.