Digital Kasipet:-
కాసిపేట మండలంలోని కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను రేపు మంగళవారం కాసిపేట ఎంపీడీవో కార్యాలయంలో అందజేయనున్నారు. ఉదయం 8 గంటలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చెక్కులను పంపిణీ చేస్తారు. మొత్తం 78 మంది లబ్దిదారుల జాబితా సోమవారం విడుదల అయింది. ఇందులో BC 44, SC 20, ST 12, మైనారిటీ 2 చెక్కులు మంజూరాయయ్యి.