Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

తెలంగాణ రైతు గోస, బీజేపీ పోరు దీక్ష

Digital Kasipet:-
తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాసిపేట మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రైతు గోస, బీజేపీ పోరు దీక్ష పేరుతో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే ఫ్లకార్డ్లను ప్రదర్శిస్తూ దీక్షలు చేశారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 1 వరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల నుండి ధాన్యన్ని కొనుగోలు చేయాలనీ, రైతు బందు చెల్లించాలని, రుణ మాఫీ చేయాలనీ డిమాండ్ చేశారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App