Digital Kasipet:-
కాసిపేట తెలంగాణ మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ అందె నాగమల్లయ్య తెలిపారు. పదవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదవ తరగతి మార్కుల ఆధారంగానే ఎంపిక చేయబడుతుందని, ఎలాంటి రాతపరీక్ష లేదని అన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 5 చివరి తేది అని తెలిపారు. అలాగే 6వ తరగతి, 7 నుండి 10 వ తరగతిలో మిగిలిన సీట్లకు దరఖాస్తు కోసం జూన్ 20 తేది వరకు పొడిగించారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.