Digital Kasipet:-
కరోనా మార్గదర్శకాలను పాటించని దుకాణాదారులపై, మరియు ప్రజలపై మంగళవారం మొత్తం 24 మందిపై కేసులు నమోదు చేసినట్లు కాసిపేట ఎస్ఐ నరేష్ తెలిపారు. మంగళవారం ఉదయం పలు దుకాణాలను సందర్శించి సూచనలు చేశారు. తప్పకుండా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, వ్యాపారాలను ఉదయం 10 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆంక్షలను పాటించకుంటే చర్యలు తప్పవని అన్నారు.