Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో 10 రోజుల క్రితం కుర్మిళ్ల శ్రీను అనే వ్యక్తి కరోనా తో చనిపోయారు. అతనిది నిరుపేద కుటుంబం కావడంతో మాజీ మంత్రి గడ్డం వినోద్ సహకారంతో కాసిపేట మండలంలోని కాంగ్రెస్ నాయకులు 25కేజీ బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు కూడా పంపిణి చేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ మాట్లాడుతు పేదలకు కష్టం వస్తే కాంగ్రెస్ పార్టీ తరుపున గడ్డం వినోద్ గారు ఎల్లపుడు ముందు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైదం రమేష్, జాడి శివ, మహంకాళి, సిడం విశ్వక్, అఖిల్, శ్రవణ్, ముడిమడుగుల హనువర్మ, కోట వివేక్ పాల్గొన్నవారు.