Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఐదు సంవత్సరాలు గడుస్తున్నా అందని సాయం

Digital Kasipet:-
కే.కే 2 ఓపెనకాస్ట్ లో భూములు కోల్పోయి 5 సoవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏలాంటి ఉపాది కల్పించక పోవడంతో సోమగూడెం(కె) గ్రామస్థులు మంగళవారం వోల్వో బండ్లను ఆపి నిరసనలు వ్యక్తం చేశారు. రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తూ స్థానికులకు, భూ నిర్వాసితులకు ఉపాది ఇవ్వకుండా స్థానికేతురులకు ఉపాది కల్పిస్తున్నారని నిరసన తెలిపారు. సాయంత్రం వరకు నిర్ణయం తీసుకొని స్పందిస్తామని ప్రాజెక్ట్ పి.ఓ తెలియజేయడంతో నిరసనను ఆపివేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సపాట్ శంకర్, ఉపసర్పంచ్ కనుకుల రాకేష్, వార్డ్ సభ్యులు సపాట్ మల్లేష్, సీపీఎం నాయకులు సంకే రవి, నిరుద్యోగులు, ప్రజలు, మహిళలు పాల్గోన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App