Digital Kasipet:-
కాసిపేట మండలంలో మాజీ మంత్రి గడ్డం వినోద్ సహకారంతో రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్సు సర్వీస్ లను శుక్రవారం ప్రారంభించారు. ముత్యంపల్లి ప్రభుత్వ హాస్పటల్ వైద్యులతో మాట్లాడి ఎవరైనా కరోనా బారిన పడిన వాళ్ళు ఉంటే ఈ సర్వీస్ ని ఉపయోగించుకునేలా సహకరించాలని కోరారు. మండలంలోని కొండాపూర్ యాప, కాసిపేట ప్రాంతాలకు వెళ్లి ప్రజలకి అంబులెన్సు టోల్ ఫ్రీ నంబర్స్ ఇచ్చి, అవసరం ఉన్నవారు అంబులెన్సు సేవలను ఉపయోగించుకవాలని తెలిపారు. ఈసందర్బంగా రత్నం ప్రదీప్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలో గడ్డం వినోద్ గారు గతంలో ఆక్సిజన్ సిలిండర్ లను పంపిణి చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ రావు, వుత్తురి సత్తయ్య, అప్పని ప్రభాకర్, మైదం రమేష్, గుండా రాజకుమార్, గోలేటి స్వామి గారు, జాడి శివ, రత్నం రాజేష్ ఖన్నా, బోర్లకుంట రాజు, గొనె రాజన్న, ముడిమడుగుల హనువర్మ, కోట వివేక్ పాల్గొన్నారు.
అంబులెన్సు టోల్ ఫ్రీ నంబర్స్ :
1.99082892492
2.9866805029