Digital Kasipet:-
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని కాసిపెట మండల బీజేపీ కార్యదర్శి రవి నాయక్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేని పేద ప్రజలను ఆదుకోడానికి రాష్ట్రప్రభుత్వం ముందుకు రావడం లేదని అన్నారు. వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచి వ్యాక్సిన్ అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని, కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేశారు.