Digital Kasipet:-
తన జీవితమంతా దళితుల అభ్యున్నతికీ కృషి చేసినా భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్బంగా తెలంగాణ జాగృతి కాసిపేట వారు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారిచుపి దేశంలో అంబేద్కర్ కంటే ముందే దళిత చైతన్యానికి నాంది పలికిన మహానుభావుడు అని కొనియాడారు. ఉద్యమకారుడిగా హక్కుల కార్యకర్తగా, రచయితగా, పాత్రికేయుడిగా, సంఘ సంస్కార్త గా ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్, మండల కోశాధికారి కనక వంశీ కృష్ణ, మండల కార్యదర్శి అట్లా మల్లేష్, కసిపేట గ్రామ జాగృతి అధ్యక్షులు దుర్గం శేఖర్, ముత్యాల వెంకటరమణ పాలుగోన్నారు.