Digital Kasipet:-
కాసిపేట మండలం లోని ముత్యంపల్లి గ్రామంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గ్రామంలోని sc కాలనీలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. గ్రామంలో 16 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా అందులో 15 కేసులు కాలనిలోనే ఉన్నాయి. కాసిపేట ఎస్సై నరేష్ కాలనిలో మైక్ ద్వారా ప్రచారం చేస్తూ వివాహలకు, అంత క్రియలకు, ఈ కరోనా సమయంలో దూరంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సమయంలో మినహా బయటకి రావద్దని అవగాహనా కల్పించారు.