Digital Kasipet:-
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం గ్రామంలో వాలీబాల్ క్రీడాకారులకు వాలీబాల్ కిట్ తో పాటు టి షర్ట్, షాట్స్ ని పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ తన నాన్న, అన్నయ్య వేముల గౌరయ్య- సదానందం ల స్మారకర్థం అందజేసినారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారుడు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ నాయకులు బైరవేని సిద్దయ్య మాట్లాడుతూ యువతను క్రీడా రంగంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని ఉద్దేశంతో, సర్పంచ్ గారు వారి తండ్రి పేరున గ్రామ యువతకు క్రికెట్ పోటీలుకాని, ఇలాంటి వాలీబాల్ కిట్ లు ఇచ్చి చెడు మార్గంలో వెళ్లకుండా ప్రోత్సాహించడం మంచి పరిణామం అని అన్నారు. సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి లో యువత పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి చెడు అలవాట్లుకు, క్రైం వైపు పోకుండా మంచిగా ఉండి వాలీబాల్ పోటిలలో పాల్గొని మన గ్రామానికి మంచిపేరు తీసుకొని రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోమని మైసక్క, గ్రామ పెద్దలు సోమని రాజం, పల్లె ఎల్లయ్య, భూనెేని రాజు, సోమని పెద్ద రాజం, చెండె నవీన్, గడ్డం శ్రీనివాస్, యువత పాల్గొన్నారు.