Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మల్కపల్లిలో మహాత్మా జోతిరావు పూలే 195వ జయంతి

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని మల్కపల్లి గ్రామంలో ఆదివారం సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా జోతిరావు పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కుడిమేత లక్ష్మి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా సామాజిక చైతన్య వేదిక వారు మాట్లాడుతూ పూలే వందేళ్ల క్రితం పేద ప్రజలకు చేసిన సేవల ఫలితంగానే అతని నేడు మనం గుర్తించుకుంటు న్నామని అన్నారు. నేటి రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు  పేద ప్రజలకు సేవలు అందించాలని అప్పుడే మన జీవితాలకు ఒక సార్థకం ఉంటుందని అన్నారు. బహుజనులు మహిళలు చదువు నేర్చుకోవడం నిషిద్ధమైన ఆ రోజుల్లో తన భార్య సావిత్రిబాయి పూలేకు  చదువు నేర్పి దేశంలో బాలికలకు మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసిన మహానీయుడు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి  కొమ్ముల  బాపు, సామాజిక చైతన్య వేదిక సహాయ కార్యదర్శి ఎంబడి కిషన్, సామాజిక చైతన్య వేదిక ముఖ్య సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య,  ఉపసర్పంచ్ జనార్దన్, తెరాస గ్రామ కమిటీ నాయకులు విద్యాసాగర్, ఉపాధ్యాయులు వెంకటేష్, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు సిడమ్  జంగు, తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App