Digital Kasipet:-
కాసిపేట మండలం మల్కపల్లి గ్రామంలో గత నెల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు జంజిరాల రమేష్ కుటుంబాన్ని ఆదివారం తెలంగాణ వికాస సమితి రాష్ట్ర నాయకులు పరామర్శించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా మనోధైర్యంతో జీవించాలని అన్నారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావని ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకునే పథకాలు తీసుకురావాలని అన్నారు. రైతులు మార్కెట్ కనుగుణంగా పంటలు సాగు చేయాలని కోరారు. రైతు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పులి రాజు, వ్యవసాయ విభాగం అధ్యక్షుడు, వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు h. రవీందర్, తిండి గా వెంకన్న మల్లోజుల విజయానంద్. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సుందిళ్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు.