Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పాత వరిపేట గ్రామానికి చెందిన గుండేటి మల్లేష్ గురువారం పిడుగుపాటుకు గురై చనిపోయాడు. చేనుకు వెళ్లి మోటర్ సైకిల్ పై తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వర్షపు చినుకులు పడుతూ ఒక్కసారిగా పిడుగు పడడంతో అక్కడికక్కడే కింద పడిపోయాడు. పిడుగు పాటు వల్ల ఒళ్ళంతా కాలగ, ఇంటికి తీసుకెళ్ళేలోపే చనిపోయినట్లు సమాచారం.