Digital Kasipet:-
మార్చ్ నెలలో శాంక్షన్ లోడు కన్నా ఎక్కువ లోడు వాడిన వారికీ డెవలప్మెంట్ చార్జెస్ మరియు సెక్యూరిటీ డిపాజిట్ చార్జెస్ ని కరంటు బిల్లులో కింద ఇవ్వడం జరిగిందని కాసిపేట మండల విద్యుత్ శాఖ అధికారి ఏఈ లక్ష్మణ్ తెలిపారు. మార్చ్ నెలలో ఈ చార్జెస్ కట్టని వినియోగదారులకు వాటిని ఈ నెల అనగా ఏప్రిల్ బిల్లులో కలపడం జరిగిందన్నారు. వినియోగదారులు ఎక్కువ లోడు చార్జెస్ ని ఈ నెల చెల్లించాలని ఆయన కోరారు. ఏమైనా సందేహాలు ఉంటె AAO/ERO /Bellampally ఆఫీస్ లో సంప్రదించాలని అన్నారు.