Digital Kasipet:-
గ్రామ పోచమ్మ 3వ వార్షికోత్సవం సందర్భంగా కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం కొత్త కాలనిలో సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ పోచమ్మ బోనాల జాతర ఘనంగా జరిగింది. గ్రామంలోని కుటుంబాలతో పెద్ద ఎత్తున పోతరాజు వేషధారణ, డప్పుల కోలాహల మధ్య మహిళలందరు బోనాలు ఎత్తుకొని పోచమ్మ దేవతకు పట్టు వస్త్రాలతో తీర్థ ప్రసాదాన్ని, నైవేద్యమును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నారిశెట్టి వెంకన్న, గడ్డం సురేష్, వార్డు సభ్యులు కొత్త రమేష్, బన్న హిందుమతి, కంచర్ల పద్మ, బొల్లెపల్లి కొమురక్క, నాయకులు గాదం గట్టయ్య, శ్రీధర్, వంశీ గ్రామ యువత పాల్గొన్నారు.