Digital Kasipet:-
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులు చెల్లించడానికి మాస్క్ ధరించి ఎండలో బయటకు వచ్చి సామాజిక దూరం పాటిస్తూ బిల్లు కౌంటర్లలో నిలబడి బిల్లు చెల్లిస్తున్నారు. మరి బిల్లు కట్టక పోతే అపరాధ రుసుములు వేయడం, కనెక్షన్ తొలగించడం జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితిలో విద్యుత్ వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించడానికి TSNPDCL App తో పాటు Paytm, PhonePe, Amazon pay, Google Pay లాంటి ఆప్ ల ద్వారా బిల్లు చెల్లించవచ్చని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు.