Digital Kasipet:-
బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తండ్రి దుర్గం రాజం స్మారక క్రికెట్ టోర్నమెంట్ ముత్యంపల్లి (కాసిపేట) లో సోమవారం మొదలయింది. దుర్గం రాజం చిత్రపటానికి పూల మాల వేసి ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు నివాళులు అర్పించారు. తదుపరి టాస్ వేసి టోర్నమెంట్ ని ఎంపీపీ రొడ్డ లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, సర్పంచ్లు ఆడే బాదు, దారావత్ దేవి, సంపత్, ఎంపీటీసీ కొండాబత్తుల రాంచందర్, pacs చైర్మన్ నీల, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మంజుల రెడ్డి, వాసుదేవ్, pacs డైరెక్టర్ కాసు సురేందర్, ఉపసర్పంచ్లు బోయిని తిరుపతి యాదవ్, పిట్టల సుమన్, తెరాస నాయకులు బొల్లు రమణ రెడ్డి, మోటూరి వేణు, రొడ్డ రమేష్, తెరాస కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.