Digital Kasipet:-
డా. BR అంబెడ్కర్ జయంతి ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో సోమగూడెం చౌరాస్తా లో ఆటో డ్రైవర్స్ కి ప్రయాణికులకు మాస్క్ లు పంపిణి చేసారు. అనంతరం కాసిపేట్ మండల కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం పడిన కష్టాలను గుర్తుచేసుకొని అందరూ రాజకీయంగా ఎదగాలని ఆర్థికంగా బలపడి అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండా రాజకుమార్, డుగుట భార్గవ్, రత్నం రాజేష్ ఖన్నా, అనపర్తి చంద్రమౌళి, మర్నేని పోశం పాల్గొన్నారు.