Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి, కాసిపేట, వరిపేట గ్రామాలలో శనివారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరి పంట కల్లాలను పరిశీలించారు. మండలంలో మొత్తం 30 పంట కల్లాలను నిర్మించడం జరుగుతుందని వ్యవసాయ అధికారిని వందన తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ పంట కల్లాలను నిర్మాణం చేయబడుతుంది అన్నారు. రైతులకి అనుమతి లేని పత్తి విత్తనాలపైన, వరి కేంద్రంలో వడ్లు తీసుకువచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఫర్టిలైజర్ కొనడానికి వెళ్లేటప్పుడు రైతులు తమ పట్టా పాస్ బుక్ తీసుకువెళ్లాలి మరియు తమకు అవసరం ఉన్నంత మేరకే మాత్రమే మందులను తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.