Digital Kasipet:-
కాసిపేట మండలం దేవపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నాయకపు గూడలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఆదివాసి నాయకపోడు సేవాసంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఆమె సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. ఎన్నో అవమానాలను అసమానతలను ఎదుర్కొని మహిళలకు విద్యను అందించిన మహనీయురాలు అని, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత చదువులు చదివి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, ఐకేపీ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రోడ్డ లక్ష్మి, ఆదివాసీ నాయకపోడు సేవ సంఘం మహిళా కార్యదర్శి కొమ్ముల రజిత, వార్డు సభ్యురాలు గడ్డం శిరీష, గ్రామ పెద్ద పూజారి లచ్చు లు, మేశి నేని హర్షిత, మేఘన తదితరులు పాల్గొన్నారు.