Digital Kasipet:-
కాసిపేట మండలంలో సోమవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థినిలను సన్మానించారు. అదేవిదంగా రేగులగూడెం గ్రామానికి చెందిన కనుక తిరుపతి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండడంతో ఆమెకు జాగృతి ఆధ్వర్యంలో ఆర్థికసహాయం అందజేశారు. సామజిక చైతన్య వేదిక కాసిపేట ఆధ్వర్యంలో వెంకటాపూర్ గ్రామంలో గత సంవత్సరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో మద్యం విక్రయాలను అడ్డుకున్న మహిళలను సన్మానించారు.